Bhimalapuram.co.in

ఉచిత పరికరములు

ఆంగ్లము తెలుగులిపిలేదు

ఇంచుమించు అన్ని రంగములకు నాణ్యమైన గొప్ప వనరులు [software]- ఉచితముగ[free software] దొరకుచున్నవి. ఈ పరికరములు వ్యాపార రీత్యా విక్రయించబడు పరికరము[proprietory software]లకు ఏ రీతిగ చూసినను తీసిపోవు. కొన్ని కోణములలో చూచిన ఇవి వ్యాపార రీత్యా విక్రయింపబడు పరికరముల కంటే మెరుగైనవి. వీటిని అంతర్జాలము[internet] నుండి దిగుమతి చేసుకొని అమర్చుకొన గలము.

ఉచిత పరికరముల కైన ప్రాధాన స్థావరములు

gnuDOTorg, linuxDOTorg, tucowsDOTcom, fsfDOTorg, freshmeatDOTnet, మఱియు sourceforgeDOTnet. పరికరములు కల్పించిన వారి స్తావరములు ఉదా|| - vlc -videolanDOTorg, Open Office - openofficeDOTorg, xz zipping - tukaaniDOTorg, ogg/ogv- theoraDOTorg, లైనక్‌స్‌వారి- ఫెడోరా, ఉబుంటు, క్నోప్పిక్స్, డెబీన్, సూసే, స్లాక్స్, పప్పి లైనక్స్ వంటి స్థావరములు.

వ్యవస్త[Operating system] : తాత్కాలికముగ/ఆకస్మికముగ వాడ తలచిన: - లైవ్‌సీడి వాడ వలెను. ఉన్న వ్యవస్త operating system/hard diskలు ప్రభావితము చేయబడవు. విశిష్టమైన లైవ్‌సీడిలలో పప్పి లైనక్స్ ఒకటి. ఇందు అన్ని రంగమునకైన పరికరములున్నవి. చాల వేగముగ పనులను నెరవేర్చు సామర్థ్యము వున్నది. చేసిన పనులను - USB drives-CD/DVD/external hard diskలో బదిల పర్చుకొన గలరు. పూర్తి వివరములకు విటికై వచ్చు టిప్పణులను చూడగలరు. స్లాక్స్ - మరొక విశిష్టమైన లైవ్‌సీడి . దిగుమతి చేసే సమయముననే కావలసిన packageలను అమర్చుకొన వచ్చును. ప్రత్యేకమైన అవసరములకు livecdlistDOTcomన దొరకు పట్టిక నుండి ఎన్ను కొన గలరు.

శాస్వతముగ లైనక్స్ వాడు కొనుట: -

ప్రత్యేకముగకాని లేక ఎంఎస్‌విండోస్/బీఎస్‌డీ/యునిక్‌స్‌లతో సహచారిగ కాని ప్రత్యేకముగ లైనక్స్ మాత్రమే కాని అమర్చుకొన గలరు. ఎంఎస్‌విండోస్‌నకు దొరకు పరికరములన్నింటికి అదే తీరున [చాల వరకు వాటి కంటే మెరుగైన తీరున] ఫలితములిచ్చు వనరులు లైనక్‌స్‌నకు కూడ దొరకుచున్నవి. వీటి మూల సూత్రములు[source code] లభించుటవలన అవసరమైన చోట కావలసిన సవరణలు, మార్పులు చేసుకొన వచ్చును. సుదీర్ఘమైన టిప్పణులు, అంతర్జాలము దారా అవసరమైనప్పుడు దోహదము/సలహాలు దొరకుట చే లైనక్స్ అన్ని విదముల విశిష్టమైన operating systemముగ పరిగణింప పడుచున్నది. అన్ని రంగములకు - క్రీడ, సంగీత, చిత్ర, చలన చిత్ర, అంతర్జాల వ్యవహారములు, వివిద కార్యాలయములకు కావలసిన సదుపాయములు, ముద్రణ - మొదలగు అన్ని విషయములకు సరైనది. వివిద రకములైన లైనక్‌స్‌ల పట్టిక ఇక్కడ ఇవ్వబడినది.

ముఖ్యమైన ఆదేశముల పట్టికను చూడ గలరు. చాల వరకు ఈ అదేశములు ఎంఎస్‌విండోస్‌లోని అదేశములతో పోలికలు కలిగి యుండును. కనుక లైనక్‌స్ వాతావరణమున పని చేయుట చాల సులభము.

పరికరములు[Packages]: చాల వరకు అన్ని రంగములకు సంబంధించిన పరికరములు system - సీడి/దీవీడిలలో/లైనక్‌స్‌తో దొరకును. అదనముగ - లేక ఇటీవలవిడుదలైన రూపము కావలసినచో అంతర్జాలమునుండి దిగుమతి చేసుకొన వచ్చును . వీటి పట్టిక ఇక్కడ ఇవ్వబడినది.

లైనక్‌స్‌ పని తీరును మెరుగు పరచూటకు చాల పధ్ధతులున్నవి. వీటి పట్టిక ఇక్కడ ఇవ్వబడినవి.

ఫ్రీబీఎస్‌డీ: లైనక్‌స్‌నకు వర్తించు ఆదేశములు, చిట్కాలు ఫ్రీబీఎస్‌డీ నకు వర్తించును. దీనికి కావలసిన పరికరములు- వనరులు- freebsdDOTorgన లభించును.

తెలుగులో లైనక్‌స్‌: లైనక్‌స్‌తో తెలుగులోను కావలసిన పనులు చేసుకొనవచ్చును. ఉచితముగ దొరకు తెలుగు ఖతులను దిగుమతి చేసుకొని , అమర్చుకొని వడుకొనవచ్చును. geditor తెలుగు లిపితోను ఉపయోగింపవచ్చును. తెలుగు లిపి తో ఫైర్‌ఫాక్స్, క్రోంలలో వ్యాసములను, దస్త్రములను చూడ వచ్చును. మైఎస్‌క్యూఎల్తో తెలుగులిపిలోని పట్టికలలు, అన్ని రూపములనున్న సమాచారములతో కావలసిన క్రియలు/కార్యములు చేసుకొనవచ్చును.ఆంగ్ల లిపి వలె తెలుగు లిపితొను అన్ని క్రియలను నిర్వహింప వచ్చును. తెలుగు వ్యాసములు/దస్త్రములలో perlతో అన్ని కార్యములు/క్రియలు నిర్వహింపగలము. తెలుగు వ్యాసములను ఫెస్‌టివల్/ఫెస్‌టివల్-టి ద్వార వినగలము. టెక్స్‌లైవ్‌తో తెలుగులిపిలో ఎటువంటి రకమైన వ్యాసము/గద్య/పద్య రచనలు/చిత్ర/చలన చిత్రము వున్న పుస్తకములు సృష్టింప గలము.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!